గడచిన పదేళ్లుగా తెలుగుదేశం పార్టీ ఎంపిగా గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా జయదేవ్ గల్లా ప్రత్యేక హోదా, పోలవరం మరియు రాష్ట్ర హక్కుల కోసం పోరాడిన తీరుతో నేటి యువతకు స్ఫూర్తి నింపిన జయదేవ్ ప్రత్యక్ష రాజకీయాల నుండి నిష్క్రమిస్తూ కృతజ్ఞతాభివందనం పేరుతో గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్ నందు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇన్నాళ్లు ఎంపి గా గుంటూరు పార్లమెంట్ కు అద్వితీయమైన సేవలు అందజేయటంతో పాటు రాజకీయాలలో నాలాంటి శ్రమజీవులను గుర్తించి పార్టీ అధినాయకత్వం సహకారంతో వివిధ అవకాశాలు కల్పించారు. గల్లా లాంటి నిస్వార్ధ సేవకుడు రాజకీయ నిష్క్రమణ బాధాకరం. డబ్బుతో జ్ఞాపికగా అటువంటి ఆగర్భ శ్రీమంతుడికి ఏమి ఇవ్వలేను. చిరకాలం మా గుండెల్లో గూడు కట్టుకుంటారు అని తెలియజేస్తూ కల్మషం లేని గుంటూరు గుండె శబ్దానికి గుర్తుగా తెలుగుయువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అంతర్జాతీయ సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ చే చిరకాలం గుర్తుండిపోయే విధంగా రూపొందించబడింది.
గుంటూరులో సైకత శిల్పం ప్రదర్శన
64
previous post