మానవత్వం మంట కలిసి పోతుంది మాటలు నేర్చిన మనిషే తప్పులు చేస్తుంటే మాటరాని ముగజీవాలు తప్పులు చేస్తున్నాయని వాటిని బంధించి, చావు దెబ్బలు కొట్టి పైగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన అట్టెం మధు అనే వ్యక్తికి చెందిన ఎద్దు కత్తెరసాల గ్రామంలో ఓ పంట చేనులో మేసింది. ఆ పంట యజమాని అయిన సర్ధార్ ఆ ఎద్దుని నిర్బంధించి చావు దెబ్బలు కొట్టి తన వద్దే ఉంచుకున్నాడు. అది వ్యతిరేకించిన యజమాని మధు మూగ జీవాన్ని ఎలా నిర్బంధిస్తావని హెచ్చరించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సర్దార్ పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. మూగ జీవాన్ని స్టేషన్ లో అప్పగించిన సర్దార్ పై చర్యలు తీసుకోవాలని యజమాని డిమాండ్ చేసాడు. ఆ మూగ జీవాన్ని చూసిన పలువురు ముక్కున వేలేసుకొని ఎద్దు పంచాయితీ స్టేషన్ వరకు చేరిందా అని చర్చ సాగిస్తున్నారు.
మూగజీవాన్ని చావుదెబ్బలు కొట్టిన సర్ధార్….
72
previous post