ప్రజల గుమ్మం ముందుకే పధకాలు….

Ponguleti Srinivasa Reddy

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ&comma; గృహ నిర్మాణ&comma; సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు&period; ఆయనకి కాంగ్రెస్ నాయకులు&comma; గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు&period; ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 వరకు ప్రజాపాలన కొనసాగుతుందని&comma; ప్రమాణం చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలు అమలు చేసేందుకు పూనుకున్నామని&comma; 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని&comma; ఇప్పటికే 2 హామీలు ప్రజలలోకి తీసుకొచ్చామని అన్నారు&period; ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదని గ్రామాలలోకి ప్రజాపాలనను తెచ్చామని&comma; గత పదేళ్లుగా స్వరాష్ట్రంలో ప్రజల కలలు కలలైనాయని&comma; చిత్తశుద్ధితో పనిచేసేందుకు ముఖ్యమంత్రి&comma; మంత్రులం కృషి చేస్తున్నామని&comma; కిందిస్థాయి ఉన్నటువంటి బీదాసాదలకు ప్రభుత్వ పథకాలు అందాలనే మా తాపత్రయం అని అన్నారు&period; మేడిగడ్డను మేము కూడా సందర్షించామని&comma; 6 లక్షల 71 కోట్లు రూపాయల అప్పును తెలంగాణ నెత్తిన పెట్టారని&comma; అప్పులు తప్పు కాక పోయినా&comma; సరైన రీతిలో ఆ నదులను సద్వినియోగం చేయలేదని&comma;కేవలం రాచ ఠీవి అనుభవించేందుకు తెలంగాణను వాడుకున్నారని&comma; విలాసాలు&comma; భోగాలు అనుభవించి ప్రజల సమస్యలను పక్కన పెట్టా రని అన్నారు&period; ప్రజల కష్ట&comma; సుఖాలలో పాలుపంచుకుంటామని&comma; గత ప్రభుత్వం తెలంగాణకు సమకూర్చిన ఆస్తులతో కొత్త సెక్రటేరియట్ కట్టారని&comma; పేదోళ్ల కష్టాలు తీర్చకుండా&comma; వ్యక్తిగత అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు&period; మీరిచ్చే ప్రతి అప్లికేషన్ కూడా కంప్యూటరైజ్ చేస్తామని&comma; నిండుకుండ లాంటి రాష్ట్రాన్ని&comma; వట్టి కుండ చేశారని&comma; తెలంగాణ ప్రజలు కోరిన కోర్కెలన్నింటినీ పూర్తి చేస్తామని&comma; ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండానే ప్రజాపాలన కార్యక్రమం పూర్తి చేస్తున్నామని&comma; ప్రజల గుమ్మం ముందుకే పధకాలు వస్తాయని&comma; పేదోళ్లకే ప్రాధాన్యత ముందుగా ఉంటుందని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.