దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల(General Elections) రెండో దశ పోలింగ్(Second Phase is Polling) కొనసాగుతుంది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో 89 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో బీఎస్పీ అభ్యర్థి హఠాన్మరణం చెందారు. అక్కడ ఓటింగ్‌ను మూడో దశకు మార్చారు. రెండో విడతలో మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో 8.08 కోట్లు పురుషులు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. మొత్తం 1.67 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16 లక్షలకు పైగా పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వివిధ పార్టీల నుంచి 1,202 మంది బరిలో ఉన్నారు.
కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లోనూ నేడే ఓటింగ్ పూర్తికానుంది. ఈ విడతతో రాజస్థాన్‌లో ఓటింగ్ పూర్తికానుంది. ఆ రాష్ట్రంలోని మొత్తం స్థానాలు 25 ఉండగా.. 12 స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ ముగిసింది. కర్ణాటక 14, ఉత్తర్‌ప్రదేశ్ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్ 6, బిహార్ 5, అస్సాం 5, పశ్చిమ బెంగాల్ 3, ఛత్తీస్‌గఢ్ 3, జమ్మూకశ్మీర్ 1, మణిపుర్ 1, త్రిపుర 1 స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.
వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ దశలోనే బరిలో ఉన్నారు. 2014 నుంచి మథురా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమామాలిని.. ప్రస్తుతం అక్కడ హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టారు. హ్యాట్రిక్ విజయాల కోసం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా..కోటా-బూందీ నుంచి, జోధ్‌పుర్ నుంచి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బరిలో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 30 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న రాజ్‌నంద్‌గావ్ స్థానంలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం భూపేశ్ బఘేల్ బరిలో దిగారు. కాంగ్రెస్ నేత శశిథరూర్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తలపడుతోన్న తిరువనంతపురంలోనూ నేడే పోలింగ్ జరుగుతోంది. వీరితో పాటు బీజేపీ తరఫున మేరఠ్ అరుణ్ గోవిల్ , బెంగళూరు దక్షిణం నుంచి తేజస్వీ సూర్య బరిలో ఉన్నారు. అలప్పుళ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ భవితవ్యాన్ని ఓటర్లు ఈరోజే నిక్షిప్తం చేయనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదలఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గలేదు. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఇంకో…
- న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం…
- బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాంరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.