చంద్రబాబు దుర్మార్గ క్రీడలకు సచివాలయ సిబ్బంది దొంగలుగా మారుతున్నారు.. విజయవాడ మధురానగర్ 208 సచివాలయం అడ్మిన్ నాగమల్లేశ్వరరావు పెన్షన్ సొమ్ము తీసుకొని పరారయ్యాడు. అవ్వ తాతలు మండుటెండలో సచివాలయం ముందు పడిగాపులు కాస్తుంటే ఊసూర్మనిపిస్తుంది. అడ్మిన్ చెడు వ్యసనాలకు, బెట్టింగులకు బానిసై అవ్వ తాతలకు అందవలసిన పెన్షన్ ను రాబందుల తన్నుకు పోయాడు. సుమారు పెన్షన్ సొమ్ము 4 లక్షల 99 వేల రూపాయలను తీసుకొని పరారైనట్లు తెలుస్తుంది. పెన్షన్ దారులకు అనుమానం రాకుండా సంబంధిత సచివాలయ సిబ్బంది అధికారులతో మాట్లాడి కొంత మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఇప్పటికే గుణదల పోలీసుల అదుపులో దొంగగా మారిన అడ్మిన్ నాగమల్లేశ్వరరావు ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దొంగ గా మారిన సచివాలయం అడ్మిన్…
128
previous post