మేడారం జాతరను డిస్టర్బ్ చేయాలని కొంతమంది చూస్తున్నారని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మేడారం జాతర పనులను పరిశీలించారు. జాతర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలన్నారు. సమ్మక్క- సారలమ్మది ఉద్యమ చరిత్ర అని, అలాంటి వనదేవతలను పూజించే తీరులో ఎక్కడా లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఉత్సవ కమిటీ జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పనుల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జాతర కోసం పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే అమ్మవార్లను 30 లక్షలమంది దర్శించుకున్నట్లు తెలిపారు. జాతర కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ లెక్క ఉందని తెలిపారు. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లను చేస్తున్నామని వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.