మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహాజాతర నాలుగు రోజులుగా భక్త జనంతో పులకించింది. నాలుగు రోజులుగా కోటిన్నర మంది భక్తుల మొక్కులందుకున్న వన దేవతలు మహా జాతర ముగియడంతో జనం నుంచి వనంలోకి వెళ్లిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు. శనివారం సాయంత్రం గిరిజన పూజారులు ప్రత్యేక పూజల మధ్య వనప్రవేశం చేయించారు. ముందుగా గోవింద రాజు, పగిడిద్ద రాజులను స్వస్థలాలకు తీసుకెళ్లారు. తర్వాత సమ్మక్కను చిలకల గుట్టలో ఉన్న వనంలోకి, సారలమ్మను కన్నేపల్లికి తీసుకెళ్లారు. ఉద్విగ్నంగా సాగిన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు జాతర చివరి రోజు కూడా భక్తులు పోటెత్తారు. వనదేవతలు అడవికి చేరే సమయంలో వాన జల్లులు కురవడంతో భక్తుల ముఖంలో చిరునవ్వు వెల్లు విరిసింది.
medaram jatara
ఆసియా లొనే అతి పెద్ద జాతర వరంగల్ జిల్లా మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు షెల్టర్ తో పాటు బస్సులను జెండా ఊపి ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామీ…. మంచిర్యాల జిల్లా మందమర్రి బస్టాండ్ నుండి 55 బస్సులను మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం TSRTC ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో బస్సు షెల్టర్ బస్సులను డిపో మేనేజర్ తో కలిసి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి మేడారం జాతర ప్రత్యేక బస్సులకు రిబ్బన్ కట్ చేసి, జెండా ఊపి ప్రారంభించి, స్వయంగా వారే బస్సులను నడిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు పోలీస్ బందోబస్తు మరియు ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ పట్టణ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రయాణికులు పాల్గొన్నారు.
మేడారం జాతరను డిస్టర్బ్ చేయాలని కొంతమంది చూస్తున్నారని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మేడారం జాతర పనులను పరిశీలించారు. జాతర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలన్నారు. సమ్మక్క- సారలమ్మది ఉద్యమ చరిత్ర అని, అలాంటి వనదేవతలను పూజించే తీరులో ఎక్కడా లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఉత్సవ కమిటీ జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పనుల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జాతర కోసం పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే అమ్మవార్లను 30 లక్షలమంది దర్శించుకున్నట్లు తెలిపారు. జాతర కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ లెక్క ఉందని తెలిపారు. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లను చేస్తున్నామని వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొండా సురేఖకు బుజ్జగింపులు.by CVR NEWSతెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.…
- ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.by CVR NEWSతెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో కూడా అమలు చేయాలంటూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.…
- తెలంగాణలో ఆర్టిఫిషియల్ పనీర్‌పై నిషేధం.by CVR NEWSతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనలాగ్, నాన్ డెయిరీ, ఆర్టిఫిషియల్ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీ సేఫ్ వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.…
ములుగు జిల్లా, మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామని సీతక్క అన్నారు , ఫిబ్రవరి 21 నుండి జాతర ప్రారంభం అవుతుంది. ఇప్పటికే 75 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సైతం మేడారం దేవతల సన్నిధి నుండే ప్రారంభించారు. అడగ్గానే నిధులు కేటాయించారు. అవసరమైన మేరకు మరిన్ని నిధులు ప్రభుత్వాన్ని కోరుతాం. మా ఇంటి ఇలవేల్పు మేడారం తల్లులు. అధికారులకు అన్ని సూచనలు చేశాం. జాతర విజయవంతం కోసం ప్రణాళిక రూపొందించాం. కాంట్రాక్ట్ పనులను అవినీతి లేకుండా పూర్తి చేస్తాం. శాశ్వత ప్రాతిపదికన చేస్తాం. కేంద్రానికి కొన్ని పనులకోసం ప్రతిపాదనలు పంపాము. మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రిక్వెస్ట్ పంపుతున్నాము. అందరూ సహకరించి జాతరను విజయవంతం చేయాలి అని ఆమె కోరారు.