Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Telangana మేడారం జాతర ఏర్పాట్లపై సీతక్క కీలక వ్యాఖ్యలు..!

మేడారం జాతర ఏర్పాట్లపై సీతక్క కీలక వ్యాఖ్యలు..!

by Satya
Seethakka

మేడారం జాతరను డిస్టర్బ్ చేయాలని కొంతమంది చూస్తున్నారని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మేడారం జాతర పనులను పరిశీలించారు. జాతర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలన్నారు. సమ్మక్క- సారలమ్మది ఉద్యమ చరిత్ర అని, అలాంటి వనదేవతలను పూజించే తీరులో ఎక్కడా లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఉత్సవ కమిటీ జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పనుల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జాతర కోసం పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే అమ్మవార్లను 30 లక్షలమంది దర్శించుకున్నట్లు తెలిపారు. జాతర కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ లెక్క ఉందని తెలిపారు. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లను చేస్తున్నామని వెల్లడించారు.

Read Also..

Follow us on : FacebookInstagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.
    తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్‌లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో…
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
    తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే…
  • తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.
    తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు హాజరుకావాలని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు.…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: