ఐఐటీ కాన్సూర్‌లో షాకింగ్ ఘటన

Prof. Sameer Khandekar

Advertisements

&NewLine;<p>ఐఐటీ కాన్సూర్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది&period; ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రొ&period; సమీర్ ఖండేకర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు&period; ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు&period; ప్రసంగం మధ్యలో ఆయన ఛాతిలో నొప్పి రావడంతో కూలబడిపోయారు&period; నిమిషాల వ్యవధిలో అచేతనంగా మారిన ఆయన్ను సమీపంలోని కార్డియాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు&period; అయితే&comma; అప్పటికే ఆయన మృతి చెందినట్టు తేలింది&period; అప్పటిదాకా ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి అకస్మాత్తుగా మరణించడంతో విద్యార్థులు&comma; సహ ప్రొఫెసర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు&period; 2019 నుంచి ప్రొ&period; ఖండేకర్ అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు&period; కాగా&comma; కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉన్న ఆయన కుమారుడు తిరిగొచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు&period; జబల్పూర్‌లో జన్మించిన ప్రొ&period; సమీర్ ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్ చేశారు&period; అనంతరం&comma; జర్మనీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు&period; 2020లో ఆయన ఐఐటీ కాన్పూర్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా నియమితులయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..