తెలంగాణ శాసనసభ సమావేశాలు ఆరోరోజు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖపై సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశముంది. ఇప్పటికే కృష్ణ ప్రాజెక్టులను బోర్డుకి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కాగా మంగళవారం కాంగ్రెస్, సీపీఐ, ఏంఐఏం ఎమ్మెల్యేలు కాలేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ఆహ్వానిస్తున్నారు. నిన్న మేడిగడ్డ నుంచి కూడా కేసీఆర్ సభకు రావాలంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత పెరగనుంది.
మరిన్నితాజావార్తలకోసంఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.