ఢిల్లీలో జరుగుతున్న రైతుల దీక్షకు సంఘీభావంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జేఎసి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. రైతుల దీక్షను అణచివేసే ధోరణిని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని నినాదాలు చేశారు. 22 రకాల పంటలకు కనీస మద్దతు ధర, వ్యవసాయ కార్మికులకు, రైతులకు పెన్షన్లు, రెండు పంటలు పండే వ్యవసాయ భూములను కార్పోరేట్ సంస్థలకు అప్పగించకుండా ఉండాలనే ప్రధాన డిమాండ్లతో ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు జేఏసీ రైతు సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. గతంలో 13 నెలల పాటు రైతులు చేసిన దీక్షలో పాల్గొన్న అనేక మంది రైతులపై కేసులు పెట్టారని, సుమారు 700 మంది రైతులు చనిపోయారని కనీసం ఆ కేసులను కొట్టివేసి, చనిపోయిన రైతుల కుటుంబాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదన్నారు. ఢిల్లీ సమీపంలో రైతులు చేస్తున్న దీక్షను అణిచివేయడానికి వారి పైన టియర్ గ్యాస్, సోనార్ వ్యవస్థను ప్రయోగించడం దారుణమన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆయనకు భారతరత్న ఇచ్చి ఆయన ఆశయలకు తూట్లు పొడుస్తోందని మండి పడ్డారు. వెంటనే మోడీ ప్రభుత్వం రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
సంఘీభావ నిరసన ర్యాలీ…
117
previous post