సంఘీభావ నిరసన ర్యాలీ…

Rally in solidarity

Advertisements

&NewLine;<p>ఢిల్లీలో జరుగుతున్న రైతుల దీక్షకు సంఘీభావంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జేఎసి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ప్రదర్శన చేపట్టారు&period; రైతుల దీక్షను అణచివేసే ధోరణిని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని నినాదాలు చేశారు&period; 22 రకాల పంటలకు కనీస మద్దతు ధర&comma; వ్యవసాయ కార్మికులకు&comma; రైతులకు పెన్షన్లు&comma; రెండు పంటలు పండే వ్యవసాయ భూములను కార్పోరేట్ సంస్థలకు అప్పగించకుండా ఉండాలనే ప్రధాన డిమాండ్లతో ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు జేఏసీ రైతు సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు&period; గతంలో 13 నెలల పాటు రైతులు చేసిన దీక్షలో పాల్గొన్న అనేక మంది రైతులపై కేసులు పెట్టారని&comma; సుమారు 700 మంది రైతులు చనిపోయారని కనీసం ఆ కేసులను కొట్టివేసి&comma; చనిపోయిన రైతుల కుటుంబాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదన్నారు&period; ఢిల్లీ సమీపంలో రైతులు చేస్తున్న దీక్షను అణిచివేయడానికి వారి పైన టియర్ గ్యాస్&comma; సోనార్ వ్యవస్థను ప్రయోగించడం దారుణమన్నారు&period; స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆయనకు భారతరత్న ఇచ్చి ఆయన ఆశయలకు తూట్లు పొడుస్తోందని మండి పడ్డారు&period; వెంటనే మోడీ ప్రభుత్వం రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం