కన్న తల్లిని ఆస్తి కోసం కడతేర్చిన కొడుకు…

The iron rod that caused the murder

Advertisements

&NewLine;<p>ఆస్తికోసం కన్నతల్లిని కడతేర్చిన సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో చోటుచేసుకుంది&period; తుగ్గలి మండలం రాతన కొత్తూరుకు చెందిన లక్ష్మీదేవిని&lpar;55&rpar; పొలాన్ని తన పేరు పైకి మార్పించాలని ఒత్తిడి చేస్తూ ఆమె ఒప్పుకోకపోవడంతో కొడుకు లిఖిత్ రెడ్డి ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు&period; లక్ష్మీదేవికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు&period; కొంతకాలం కిందటే భర్తను పోగొట్టుకున్న లక్ష్మీదేవి కూతురికి పెళ్లి చేసింది&period; ఆ తర్వాత పొలాన్ని తన పేరు పైకి మార్చాలని తల్లితో తరచుగా లిఖిత్ రెడ్డి గొడవపడేవాడు&period; కొడుకుతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక రాతనలోని తన బంధువుల ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది&period; అయితే గత రాత్రి తల్లికి ఫోన్ చేసి పెళ్లి సంబంధానికి వస్తున్నారని రావాలని చెప్పాడు&period; హత్య చేయాలని ఉద్దేశంతోనే తనను రమ్మన్నాడని తెలుసుకోలేని తల్లి స్వగ్రామానికి వచ్చింది&period; ముందుగానే అనుకున్న ప్రకారం ఇంటికి చేరుకున్న లక్ష్మీదేవిని వ్యవసాయానికి వాడే ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు&period; గ్రామస్తులకు విషయం తెలియడంతో అక్కడికి చేరుకునే లోపు పరారయ్యాడు&period; పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.