128
కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండిలోని ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి కాళేశ్వరం, మెడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కాలేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన బ్లాక్ వన్ బ్లాక్ టు ఆఫీసుల్లో ఉన్న ఫైల్స్ ను తనిఖీలు చేశారు. అకస్మాత్తుగా ఎల్ఎండిలోని ఎస్సారెస్పీ ఆఫీసులకు సంబంధించి తనిఖీలు చేస్తుండడంతో చుట్టుపక్కల పరిణామాలు ఉత్కంఠగా మారింది. తనిఖీల తర్వాత ఎస్పీ రమణారెడ్డి పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నాయి. ఈ సందర్భంలో ఈ తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.