126
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సివిలియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 2156 మందిని ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసు శాఖ బోర్డర్ చెక్ పోస్టులలో విధులు నిర్వహించేందుకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ను నియమించడం జరిగింది. 2022 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఎటువంటి నోటీసులు లేకుండా అనుకోని రీతిలో SPO ఉద్యోగాలను తొలగించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలక్షన్ కోడ్ లోపు మమ్ములను ఉద్యోగాలలోకి తీసుకుని మాకు మా కుటుంబాలకు న్యాయం చేయాలని వేడుకుంటున్నామని తెలిపారు.