హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం

Advertisements

<p>సమ్మర్ వెకేషన్‌ను కేవలం సరదాగా గడపడమే కాదు&period;&period; చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తి&comma; క్రమశిక్షణ&comma; ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సిద్ధిపేటలో అద్భుతమైన వేదిక ఏర్పాటైంది&period; సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని జయశంకర్ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం చిన్నారుల క్రికెట్ హడావుడితో కళకళలాడుతోంది&period; హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రికెట్ శిక్షణా శిబిరానికి అటు పిల్లలు&comma; ఇటు తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది&period; అండర్-12 నుంచి అండర్-19 విభాగాల వరకు దాదాపు 120 మంది విద్యార్థులు ఈ క్యాంప్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు&period; అనుభవజ్ఞులైన కోచ్‌లు ప్రతిరోజూ ఉదయం వీరికి బ్యాటింగ్&comma; బౌలింగ్&comma; ఫీల్డింగ్&comma; వికెట్ కీపింగ్‌లో మెళకువలు నేర్పిస్తున్నారు&period; ఆటతో పాటు వార్మప్ ఎక్సర్‌సైజులు&comma; రన్నింగ్ వంటివి చేయిస్తూ పిల్లల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు&period; గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం ప్రతిభావంతులైన పిల్లలు ఈ క్యాంప్‌కు వస్తున్నారని&period;&period; భవిష్యత్తులో రాష్ట్ర&comma; జాతీయ స్థాయిల్లో రాణించే క్రికెటర్లను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు&period; ఈ శిక్షణపై కోచ్‌లు&comma; అలాగే క్రికెట్ నేర్చుకుంటున్న చిన్నారులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..

బ్యూటీ క్లినిక్లకు కేంద్రం వార్నింగ్..