సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులతో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో లో పాల్గోని భక్తులు ఫోన్ కాల్ లో అడిగిన ప్రశ్నలకు లైవ్ లో సమాధానం ఇచ్చి వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబరు నెలలో 19.16 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని, హుండీ ద్వారా 116.73 కోట్ల రూపాయలు కానుకలు టిటిడికి లభించాయన్నారు. మొత్తం ఒక కోటి 46 వేల లడ్డూలను భక్తులకు విక్రయించామని, 40.77 లక్షల మంది భక్తులు అన్నప్రసాదంను స్వీకరించగా, 6.87 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించినట్లు టిటిడి ఈవో వెల్లడించారు. అయోధ్యలో 22వ తేదీ శ్రీ రామచంద్రులవారి విగ్రహ ప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ను క్యూ లైన్‌లో నిలబడి కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని, ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15వ తేదీ తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని పేరేడ్ మైదానంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు ‘‘శ్రీ గోదా కళ్యాణం’’ వైభవంగా నిర్వహిస్తామన్నారు. శ్రీవారి భక్తులు టిటిడి పేరిట ఉన్న నకిలీ వెబ్‌సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టిటిడి అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులను టిటిడి ఈవో కోరారు. తిరుమలలో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం, జనవరి 25న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహిస్తామని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు.
తిరుపతిలో వైభవంగా ‘‘శ్రీ గోదా కళ్యాణం’’…
147
previous post