శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు…

Sri Rama Navami Tiru Kalyana Brahmotsavam

Advertisements

&NewLine;<p>భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ ముహూర్తాన్ని వైదిక కమిటీ నిర్ణయించింది&period; భద్రాద్రిలో స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోది నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మంగళవారం నుంచి చైత్ర శుద్ధ పూర్ణిమ మంగళవారం వరకూ&comma; అనగా ఏప్రిల్ 9 వ తేదీ నుండి 23వ తేదీ వరకూ భద్రాద్రిలో శ్రీస్వామి వారి వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు&period; ఏప్రిల్ 17 బుధవారం ఉదయం 10&period;30 గంటల నుంచి 12&period;30 గంటల వరకూ మిథలా స్టేడియంలోని కళ్యాణ మండపంలో స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు&period; అదే రోజు సాయంత్రం శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభిస్తారు&period; ఏప్రిల్ 18వ తేదీ గురువారం శ్రీ స్వామి వారికి మహా పట్టాభిషేకం ఘనంగా జరుగుతుంది&period; అదే రోజు స్వామి వారికి రధోత్సవం నిర్వహిస్తామని వైదిక కమిటీ తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.