శ్రీశైలం కార్తిక పౌర్ణమి దీపారాధనలు

Srisailam Kartika Poornami Dipradhans

Advertisements

&NewLine;<p>కార్తికమాసం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రం భక్తుల రద్దీతో సందడిగా మారింది&period; ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు నిర్వహించారు&period; గంగాధర మండపం&comma; ఆలయం ఉత్తర మాఢవీధి కార్తిక దీపారాధనలతో శోభాయమానంగా మారింది&period; ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పౌర్ణమి గడియలు ఉన్నట్లు దేవస్థానం అర్చకులు తెలిపారు&period;<br>ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద పుణ్యనది హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు&period; దీనిలో భాగంగా దేవస్థానం అర్చకులు కృష్ణవేణి నదీమతల్లికి కర్పూర హారతులు ఇవ్వనున్నారు&period; రాత్రి 7 గంటలకు ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు జ్వాలాతోరణోత్సవం జరగనున్నది&period; ఈ ఉత్సవంలో రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా పాల్గొననున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.