అమరావతి, భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ. 13వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, విజయవాడ. తుఫాను హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కు కిసాన్ మోర్చా పిలుపు. వరిచేల వద్దకు వచ్చి నష్టం అంచనాలు వేయాలి. రైతు వద్ద కు ప్రతి వడ్ల గింజ కొనాలని కోరుతూ 13వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో కలెక్టరేట్ ల వద్ద ధర్నాలకు దిగనున్నామని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి వెల్లడించారు. కౌలు రైతుల ను ఆదుకోవడం తో పాటు రెండు రోజుల్లో రైతు లు వద్ద తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కుమార స్వామి డిమాండ్ చేశారు. పంట నష్టం ప్రాధమిక నివేదిక కేంద్రానికి అందచేయని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. వేలకోట్ల రూపాయలు పంటనష్టం జరిగితే అంచనాలు రూపొందించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక దిశలో ఉంది. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి. తడిచిన ధాన్యం అయినకాడికి అమ్ముకొంటున్న రైతులు – చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందించాలి. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఉదారంగా చెల్లించాలి. పత్తి, మిరప, పొగాకు, అరటి, పసుపు పంటలకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలి. ఉద్యానవన పంటలకు ఎకరాకు లక్ష రూపాయల సాయం అందించాలి. డ్రైనేజ్ , ఇరిగేషన్ కాలువలను వెంటనే ఆధునీకరించాలి. పంట కోల్పోయిన రైతుల పంటరుణాలను మాఫీ చేయాలి. ఎరువులు, విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాలి. ప్రతి రైతుకు పంటల బీమా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కుమార స్వామి డిమాండ్ చేశారు, కిసాన్ మోర్చా ఆందోళన కు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
రైతు సమస్యల పై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు
70
previous post