అమరావతి, భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ. 13వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, విజయవాడ. తుఫాను హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కు కిసాన్ మోర్చా పిలుపు. వరిచేల వద్దకు వచ్చి నష్టం అంచనాలు వేయాలి. రైతు వద్ద కు ప్రతి వడ్ల గింజ కొనాలని కోరుతూ 13వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో కలెక్టరేట్ ల వద్ద ధర్నాలకు దిగనున్నామని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి వెల్లడించారు. కౌలు రైతుల ను ఆదుకోవడం తో పాటు రెండు రోజుల్లో రైతు లు వద్ద తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కుమార స్వామి డిమాండ్ చేశారు. పంట నష్టం ప్రాధమిక నివేదిక కేంద్రానికి అందచేయని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. వేలకోట్ల రూపాయలు పంటనష్టం జరిగితే అంచనాలు రూపొందించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక దిశలో ఉంది. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి. తడిచిన ధాన్యం అయినకాడికి అమ్ముకొంటున్న రైతులు – చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందించాలి. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఉదారంగా చెల్లించాలి. పత్తి, మిరప, పొగాకు, అరటి, పసుపు పంటలకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలి. ఉద్యానవన పంటలకు ఎకరాకు లక్ష రూపాయల సాయం అందించాలి. డ్రైనేజ్ , ఇరిగేషన్ కాలువలను వెంటనే ఆధునీకరించాలి. పంట కోల్పోయిన రైతుల పంటరుణాలను మాఫీ చేయాలి. ఎరువులు, విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాలి. ప్రతి రైతుకు పంటల బీమా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కుమార స్వామి డిమాండ్ చేశారు, కిసాన్ మోర్చా ఆందోళన కు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
kisan morcha
గుంటూరు పట్టణం వ్యవసాయ కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముట్టడికి బిజెపి కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 400కరువు మండలాలకు 130 ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వక్తం చేశారు. ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తుందని ఆవేదన చెందారు. ఇది వ్యతిరేక ప్రభుత్వం అంటూ వ్యవసాయ కార్యలయం వద్ద బిజెపి కిసాన్ మోర్చా నాయకుల నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేశారు. న్యాయం చేసే వరకూ తమ పోరాటం ఆగదన్నారు. రైతుల కోసం కిసాన్ మోర్చా అండగా ఉంటుందని తెలిపారు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.
రాష్ట్ర వ్యవసాయ కమీషన్ కార్యాలయం ముట్టడి కి సిద్దమైన కిసాన్ మోర్చా రాష్ట్ర నేతలు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి ని అరెస్టు చేసేందుకు జల్లెడ పడుతున్న పోలీసులు. కిసాన్ మోర్చా రాష్ట్ర నేతల ఇంటి ఆడ్రస్ లు కోసం పోలీసు వేగులు గత 24గం. లుగా ప్రయత్నాలు. కిసాన్ మోర్చా రాష్ట్ర నేతలు పోలీసులు కళ్ళు కప్పి కమీషనర్ కార్యాలయం సమీపంలో మకాం. రైతు సంఘాలు కిసాన్ మోర్చా కు మద్దతు,
చిగురుపాటి తో టచ్ లో ఉన్న రైతు సంఘాలు. రైతాంగ సమస్యలు పరిష్కారం చేయకుండా పోలీసు బూటు కాళ్ళతో అణిచి వేయాలని దుర్మార్గ ప్రభుత్వం ఆలోచన పై ఉద్యమిస్తామని హెచ్చరించిన కుమార స్వామి.





Total views : 78555