అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమాన్ని అణచివేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించటం అత్యంత నిరంకుశ వైఖరికి, నియంత పాలనకు ప్రత్యక్ష నిదర్శనమని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఐసీడీఎస్ కార్యాలయం వద్ధ మూడవ రోజు సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్యబద్దంగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహనరెడ్డి బాధ్యత మరిచి నాలుగున్నర ఏళ్లుగా ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించి కేసులతో వేధిస్తున్నట్లు తెలిపారు. నా మహిళలు నా ఎస్సీ నా బీసీ అనే జగన్మోహనరెడ్డికి అంగన్వాడీ కార్యకర్తలు మహిళలు, బీసీలు, ఎస్సీలు అనే సంగతి తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే టీడీపీ, జనసేన ప్రభుత్వంలో ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సియం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన్నారు.
మూడవ రోజుకు చేరిన సమ్మె….
70
previous post