పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి…

Suicide attack in Pakistan

Advertisements

&NewLine;<p>పాకిస్థాన్‌లో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది&period; ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారని&comma; ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు&period; ఈ ఘటన పెషావర్‌లోని నాసిర్‌బాగ్‌ రోడ్‌లోని బోర్డు బజార్‌లో చోటుచేసుకుంది&period; ఆ ప్రాంతంలో పార్క్ చేసినటువంటి మోటార్‌ సైకిల్‌లో పేలుడు పదార్థాలు అమర్చి ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు&period; పేలుడులో మరణించిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు&comma; గాయపడిన వారిని ఖైబర్‌ టీచింగ్‌ ఆస్పత్రికి తరలించారు&period; రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది&period; ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు&period; అయితే ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు&period; ఇంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన పేలుడులో ఐదుగురు పోలీసులు మరణించగా&comma; ఇద్దరు గాయపడ్డారు&period; గత నెలలో&comma; సార్వత్రిక ఎన్నికలకు ముందు పాకిస్తాన్‌లో వరుస బాంబు దాడులు జరిగాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్