శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం శంకరగల్లు, రాళ్లపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తెదేపా (TDP), జనసేన(Janasena), భాజపా (BJP) ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ (Sunil Kumar) ప్రచారం సాగించారు. ప్రచారంలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా దేవాలయంలో పూజలు నిర్వహించి వాల్మీకి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. గ్రామాల్లో ఇంటింటా తిరిగి కరపత్రాలు అందించి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. పలుచోట్ల ప్రజలు తెలిపిన సమస్యలు తెలుసుకొని.. తెదేపా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడగానే సమస్యలు పరిష్కరిస్తామని సునీల్ ప్రజలకు హామీ ఇచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంతో హంద్రీనీవా కాలువ పనులు పూర్తి కాలేదు. భూగర్భ జలాలు అడుగంటి రైతులు, ప్రజలు గ్రామాలు వదిలి బెంగళూరుకు వలసలు వెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తెదేపా సానుభూతి పరులకు సంక్షేమ పథకాలు అందలేదు. ప్రజలకు అన్ని విధాల తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుంది. తెదేపాకు ఓటు వేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలని సునీల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇది చదవండి: బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను ఖండించిన వెంకటే గౌడ..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి