58
మహిళ మెడలో బంగారు చైను దొంగలిస్తున్న నిందితున్ని బుధవారం మదనపల్లి ఒకటవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి ఒకటో పట్టణ సిఐ మహబూబ్బాషా, ఎస్ఐ హరిహర ప్రసాద్ మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లిలో పలుచోట్ల మహిళల మెడలో బంగారు గోలుసులను చోరీచేసిన నిందితుడుగా కురబలకోట మండలంలోని దాదంవారిపల్లెకు చెందిన సయ్యద్ మహబూబ్విరా కుమారుడు సయ్యద్ బహదూర్ (24). బెట్టింగులకు బానిసై మహిళ మెడలోని బంగారు గొలుసులు దొంగిలించాడు అని అన్నారు. ఈ క్రమంలో నిందితుడు ఐదు కేసుల్లో నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. అరెస్టు చేసిన నిందితుడి వద్ద సుమారు ఆరు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి నట్లు తెలిపారు.