రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధి ఆస్నాద్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై మెరుపు దాడి చేశారు. పదిమంది జూదగాళ్లను అరెస్టు చేసి, వారి నుంచి 14 లక్షల 48 వేల నగదును, పది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన జూదరులు ఒక ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారు. గోవాలో జరిగే క్యాసినో మాదిరిగా చిప్స్ లు , కమిషన్లు, లక్షల పెట్టుబడులతో భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నారని అన్నారు. గత కొంతకాలం నుంచి మహారాష్ట్ర సరిహద్దుల్లో పేకాట నిర్వహిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా వీరికి స్థావరాలకు సెక్యూరిటీగా సెంట్రీలను ఏర్పాటు చేసుకొని పేకాట నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే ఎలాంటి వ్యక్తులనైనా వదిలేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
103
previous post