భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం లోని బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్యాంపు కార్యాలయం లో గులాబి రంగుల ఫ్లెక్సీలు తీసివేసి, కాంగ్రెస్ రంగుల ఫ్లెక్సీలు వేయడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్నటి వరకు గులాబీ రంగులో ఉన్న ఫ్లెక్సీలు ఈ రోజు ఉదయం కాంగ్రెస్ రంగులో ఉన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తెల్లం వెంకట్రావు గత కొన్ని రోజులుగా మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. 15 రోజుల క్రితం మొదటిసారి ముఖ్యమంత్రి కలిసిన భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, మళ్లీ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ నేపథ్యంలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని ప్రజల్లో చర్చ నడుస్తోంది. ఈ రోజో రేపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
గులాబీ రంగు పోయే.. ఇప్పుడంతా మూడు రంగులే
104
previous post