67
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోకల్ బాయ్ నాని ప్రమేయం ఏమీ లేదని తేల్చారు. ఆ ఘటనకు కారకులైన వాసుపల్లి నాని, అతని మేన మామ సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనతో తమ వారికి ఏం సంబంధం లేదనీ.. వారిని విడిచి పెట్టాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు.ఘటన సమయంలో అసలు వాళ్లు అక్కడ లేరని.. తప్పుడు సాక్ష్యలతో అరెస్ట్ చేసారని ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో పోలీసులకు, మత్స్యకార మహిళలకు మధ్య తోపులాట జరిగింది.వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఆగ్రహానికి గురైన మత్స్యకార మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో..ఆందోళనకారులను పోలీసులు వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేశారు.