103
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంమైన నేపథ్యంలో అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగంలో అంతా అబద్దాలు చెబుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన చెపట్టారు. టీడీపీ సభ్యులు తమ సీట్లలో కూర్చుని నినాదాలు చెసారు. కొంత సేపటి తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలెక్కడ అంటూ ప్లకార్డులతో నిరసనలు చెయడంతో సభలో గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేసారు.