2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత కూటమి ప్రభుత్వం మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మొదటి రోజు సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడింది. కాగా మొదటి రోజు సభకు హాజరైన వైసీపీ నేతలు గవర్నర్ ప్రసంగం చేస్తుండగానే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. కాగా రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ సభ్యులు సమావేశాలకు హాజరు కాలేదు. అయినప్పటికి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. స్కూళ్లలో నాడు-నేడు పనుల్లో భారీ అవినీతి జరిగిందని.. అవినీతిపై విచారణకు ఆదేశిస్తామని లోకేష్ అన్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేస్తామని.. అత్యుత్తమ విద్యావిధానాన్ని తీసుకొస్తామని సభలో మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ట్రంప్ రెండ్రోజుల చైనా పర్యటన ముగిసింది. ఒప్పంద ప్రకటనలేవీ లేకుండానే ఈ పర్యటన ముగిసింది. ఐతే కీలకాంశాల్లో ఏకాభిప్రాయాలు కుదిరాయని, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కీలక పురోగతి…
- ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య నెలకొన్న సుదీర్ఘ ఘర్షణలకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాలు తమ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో మూడు వారాల పాటు పొడిగించేందుకు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా…
- వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది. డెలివరీ కోసం వచ్చే గర్భిణీల ప్రాణాలతో వైద్య సిబ్బంది చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఒక బాలింత విషయంలో వైద్యులు చేసిన నిర్లక్ష్యం ఆమె…
- జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ 7వ వార్డులో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు 18 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ కాలనీలో ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు…
- యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్తో మోదీ భేటీ …ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబికి చేరుకున్నారు. మోదీ విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే, ఆ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా వచ్చి అరుదైన గౌరవాన్ని అందించాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 78418