హైదరాబాద్ మెట్రో రెండోదశకు కేంద్రం అంగీకారం…

హైదరాబాద్ మెట్రో రెండోదశకు కేంద్రం అంగీకారం

Advertisements

<p>హైదరాబాద్‌ మెట్రో సెకండ్‌ ఫేజ్‌ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి&period; ఇందులో భాగంగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి&period; కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు&period; నగరాభివృద్ధి&comma; మౌలిక వసతులు&comma; పారిశుద్ధ్యం&comma; ప్రజారవాణాకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు&period; ఖట్టర్‌తో భేటీకి సంబంధించిన వివరాలపై ఓ ప్రకటన విడుదల చేశారు కిషన్‌రెడ్డి&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై సమావేశంలో చర్చ జరిగిందని తెలిపారు కిషన్ రెడ్డి&period; ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ సంస్థ నుంచి టేకోవర్ చేసుకున్న నేపథ్యంలో మిగిలిన రెండోదశ పనులకు సంబంధించిన DPR&comma; ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత&period;&period;కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు&period; హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు&period; కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాలు 50&colon;50 ఖర్చుచేసే ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు&period; భాగ్యనగరంలోని మూసీనది పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశంపైనా చర్చ జరిగిందని చెప్పారు కిషన్‌రెడ్డి&period; మూసీ నదిలో కలుస్తున్న మురుగునీటి శుద్ధికి అమృత్‌ 2&period;0లో భాగంగా రూ&period;3&comma;975 కోట్లతో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..