కరీంనగర్‍లో ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత ..

కరీంనగర్‍లో ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

Advertisements

<p>హుజురాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది&period; బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయంలోకి బీజేపీ శ్రేణులు చొచ్చుకెళ్లారు&period; ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు&period; బీజేపీ కార్యకర్తలపై బీఆర్‌ఎస్ శ్రేణులు కర్రలతో దాడి చేశారు&period; వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు&period; బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసి&period;&period; పోలీస్‌స్టేషన్‌కు తరలించారు&period; బీఆర్‌ఎస్ కార్యకర్తలను క్యాంప్ కార్యాలయానికి తరలించి&comma; గేట్లు మూసేశారు&period;<&sol;p>&NewLine;<p>కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యారు&period; కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంతో పాటు పాడి కౌశిక్‌రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు&period; దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు&period;&period; బీజేపీ శ్రేణులను చెదరగొట్టారు&period; భారీ బందోబస్తు నడుమ కౌశిక్ రెడ్డిని కరీంనగర్ నుంచి హుజురాబాద్‌కు తరలించారు&period; హుజురాబాద్‌ క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు&period; కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై దాడికి యత్నించారు&period; దీంతో వారిని బీఆర్‌ఎస్ కార్యకర్తలు&comma; కౌశిక్ రెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు&period; పోలీసులు ఉండగానే బీజేపీ శ్రేణులు చొచ్చుకురావడంతో కౌశిక్ రెడ్డి అనుచరులు వారిపై కర్రలతో దాడి చేశారు&period; దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..