సింగరేణి కార్మికులకు శుభవార్త.

సింగరేణి కార్మికులకు శుభవార్త

Advertisements

<p>సింగరేణి మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా&comma; వివాదరహితంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి&comma; ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు&period; వివిధ కారణాల వల్ల కొద్దికాలంగా నిలిచిపోయిన ఈ మెడికల్ బోర్డు ప్రక్రియను అతి త్వరలోనే యథావిధిగా పునఃప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు&period; ఎలాంటి అక్రమాలు&comma; అవకతవకలు&comma; మోసాలకు తావులేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు&period; అర్హులైన కార్మికుల వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉద్యోగ అవకాశాలు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలన్నారు భట్టి విక్రమార్క&period; నేడు మంచిర్యాలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో 335 మంది వారసులకు కారుణ్య నియామక పత్రాలను స్వయంగా అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు&period; ఇటీవల కోల్ బెల్ట్ ప్రాంత మంత్రులు&comma; శాసనసభ్యులతో జరిగిన సమావేశంలో వ్యక్తమైన కార్మికుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం&comma; సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.