హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

Advertisements

<p>తెలంగాణ రైతులను లక్ష్యంగా చేసుకుని నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తోన్న అంతర్రాష్ట్ర రాకెట్‌ను ఎస్‌వోటీ ఎల్బీనగర్‌ జోన్‌ పోలీసులు ఛేదించారు&period; పక్కా సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీస్&ZeroWidthSpace; అధికారులు&comma; వ్యవసాయ శాఖ సిబ్బంది&comma; హయత్‌నగర్‌ పోలీసులు&period;&period; పీఎస్&ZeroWidthSpace; పరిధిలోని పెద్ద అంబర్&ZeroWidthSpace;పేట వద్ద ఈ రోజు నిర్వహించిన జాయింట్&ZeroWidthSpace; ఆపరేషన్&ZeroWidthSpace;లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని&comma; వారి వద్ద నుంచి 600 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఆంధ్రప్రదేశ్&ZeroWidthSpace;లోని నంద్యాల జిల్లా నుంచి తెలంగాణకు నిషేధిత బీటీ -3 పత్తి విత్తనాలను అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎల్బీనగర్&ZeroWidthSpace; జోన్&ZeroWidthSpace; ఎస్‌వోటీ బృందం&comma; వ్యవసాయ శాఖ అధికారులు&comma; హయత్‌నగర్‌ పోలీసులు కలిసి పెద్ద అంబర్&ZeroWidthSpace;పేటలోని పిస్తా హౌస్‌ సమీపంలో ఔటర్&ZeroWidthSpace; సర్వీస్&ZeroWidthSpace;రోడ్డులో తనిఖీలు నిర్వహించారు&period; ఈ క్రమంలో అనుమానాస్పదంగా అక్కడక్కడే తిరుగుతున్న టాటా నెక్సాన్‌&comma; మహీంద్రా బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేయగా 10 గోనె సంచుల్లో సుమారు 600 కిలోల నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలు లభించాయి&period; వెంటనే నిందితులు చలివెందుల రాజారామ్‌&comma; గోస స్వామి దాసు&comma; అనుముల మల్లేశ్వరయ్య&comma; కందాల చిన్న ఓబులేసును అదుపులోకి తీసుకుని విచారించిన వెంటనే అరెస్ట్‌ చేశారు&period; వీరు అధిక దిగుబడి వస్తుందని తెలంగాణ రైతులను మభ్యపెట్టి నకిలీ విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది&period; నకిలీ సీడ్&ZeroWidthSpace; గ్యాంగ్&ZeroWidthSpace;లో ప్రధాన నిందితుడైన రామ్‌మోహన్‌రెడ్డి పరారీలో ఉండగా&comma; అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు&period; ఈ నకిలీ విత్తనాల వల్ల మొలకలు సరిగా రాకపోవడం&comma; పంట దిగుబడి తగ్గడం&comma; రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం కలగడం జరుగుతుందని వ్యవసాయ అధికారులు హెచ్చరించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..

బ్యూటీ క్లినిక్లకు కేంద్రం వార్నింగ్..