వనపర్తిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రం..

వనపర్తిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రం

Advertisements

<p>వనపర్తిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రం&comma; జిమ్ సెంటర్‌ను జోగులాంబ గద్వాల్ జోన్ డిఐజి ఎల్&period;ఎస్&period;చౌహన్ ప్రారంభించారు&period; పోక్సో కేసుల బాధితులకు ఒకే చోట న్యాయ సహాయం&comma; మానసిక భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2018లో భరోసా కేంద్రాలను ప్రారంభించిందన్నారు&period; ఈ విధానం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు&period; బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ వారికి అవసరమైన సహాయం అందించడం భరోసా కేంద్రాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు&period; అలాగే జిల్లా కలెక్టర్ సహకారంతో ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో జిమ్ ఏర్పాటు చేశామన్నారు&period; ప్రతి ఒక్కరూ శారీరక దారుఢ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు&period; రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి&comma; ఎమ్మెల్యే మెగా రెడ్డితో కలిసి డీఐజీ పోలీసు సిబ్బందికి నూతన క్యాప్స్‌ను పంపిణీ చేశారు&period; అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక క్రీడా&comma;యువజన వారోత్సవాల్లో భాగం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు&period; ఈ టోర్నమెంట్‌లో పోలీస్ జట్టు విజేతగా నిలవగా&comma; ఉపాధ్యాయుల జట్టు రన్నరప్‌గా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..