వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

Advertisements

<p>వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది&period; డెలివరీ కోసం వచ్చే గర్భిణీల ప్రాణాలతో వైద్య సిబ్బంది చెలగాటం ఆడుతున్నారు&period; తాజాగా ఒక బాలింత విషయంలో వైద్యులు చేసిన నిర్లక్ష్యం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది&period; బషీరాబాద్ మండలం నావంగి గ్రామానికి చెందిన ఆర్తి అనే గర్భిణీ తన మొదటి కాన్పు కోసం మే 3à°µ తేదీన భర్త రమేష్‌తో కలిసి తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో చేరింది&period; ఆమెకు వైద్యులు నార్మల్ డెలివరీ చేశారు బాబు పుట్టాడు&period; అయితే&comma; మొదటి కాన్పు కావడంతో కాన్పు సమయంలో లోపల కాటన్ పెట్టేసి&comma; అలాగే కుట్లు వేశారు&period;<br &sol;>&NewLine;&ZeroWidthSpace;<br &sol;>&NewLine;ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారం రోజుల తర్వాత ఆర్తి తీవ్ర అనారోగ్యానికి గురైంది&period; దీంతో ఆమె అత్తగారి ఇల్లు ఉన్న కర్ణాటకలోని కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లగా&comma; అక్కడ స్థానిక వైద్యులు పరీక్షించారు&period; వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే లోపల కాటన్ ఉంచి కుట్లు వేయడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిందని వారు నిర్ధారించారు&period; దీంతో అక్కడి వైద్యులు లోపల ఉన్న కాటన్‌ను తొలగించారు&period; ఇన్ఫెక్షన్ తీవ్రమై&comma; జ్వరం విపరీతంగా రావడంతో బాధితులు మళ్లీ తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు&period; ఇక్కడ చేరిన 48 గంటలు గడిచినా పరిస్థితి అదుపులోకి రాకపోగా&comma; జ్వరం తగ్గలేదు&period; దీంతో ఇక్కడి వైద్యులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ&comma; పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాలంటూ ఉచిత సలహా ఇచ్చి చేతులెత్తేశారు&period; గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు ఆర్తిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్