రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేల విజ్ఞప్తి.

రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేల విజ్ఞప్తి

Advertisements

<p>పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తగిన నీటి కేటాయింపులు జరపాలని&comma; జిల్లా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు&comma; నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి నేతృత్వంలోని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది&period; ఈ మేరకు వారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు&period; ఎదుల–దిండి కాలువల ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు&period; ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; దీనిని పరిశీలించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు&period; పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు 2 టీఎంసీల నీటిని తరలించేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు మంత్రిని కోరారు&period; అదేవిధంగా&comma; శ్రీశైలం జలాశయం నుంచి నల్గొండ మరియు పాలమూరు–రంగారెడ్డి ప్రాంతాలకు తగిన విధంగా నీటి కేటాయింపులు కల్పించాలని కోరుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరొక వినతిపత్రాన్ని సమర్పించారు&period; ఉమ్మడి జిల్లా సాగు&comma; తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.

వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.

కొడంగల్ లో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.