నల్గొండలో ఆర్‌ఐపై రైతుల తీవ్ర ఆరోపణలు.

Advertisements

<p>నల్గొండ జిల్లాలో భూ రీ-సర్వే కార్యక్రమంపై తీవ్ర వివాదం నెలకొంది&period; శాలిగౌరారం మండలం వద్దిపాముల గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ అవగాహన సదస్సులో రెవెన్యూ అధికారుల ఎదుటే రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; తక్కెళ్లపహాడ్ గ్రామ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న ఆర్‌ఐ రఫీపై అవినీతి&comma; రికార్డుల తారుమారు&comma; రైతులను బెదిరించడం వంటి ఆరోపణలు గుప్పించారు&period; మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేసి భూముల సర్వే చేయకుండా రికార్డుల్లో మార్పులు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తూ ఆర్డీవో&comma; కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ నెల 14à°¨ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించి ఆర్‌ఐ రఫీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు&period; అయినప్పటికీ చర్యలు లేకపోవడంతో మరోసారి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు&period; పట్టాలు లేని భూములను డబ్బులు తీసుకుని రికార్డుల్లో నమోదు చేస్తున్నారని&comma; అసలు అర్హులైన రైతుల పనులను ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో పెడుతున్నారని ఆరోపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>అంతేకాదు&&num;8230&semi; ఆదాయ&comma; కుల ధ్రువీకరణ పత్రాలకు 500 రూపాయలు&comma; షాదీ ముబారక్&comma; కల్యాణలక్ష్మి దరఖాస్తులకు 5 వేల రూపాయల వరకు&comma; రేషన్ కార్డుకు 1&comma;500&comma; భూముల సర్వేలకు భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు&period; డబ్బులు ఇవ్వకపోతే ఫైళ్లు కదలవని&comma; పాస్‌బుక్కులు రద్దు చేయిస్తానంటూ బెదిరిస్తున్నారని కూడా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>సంబంధిత రెవెన్యూ అధికారులు &comma;&comma; ఆర్‌ఐ రఫీ నుంచి దీనిపై అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు&period; ఫిర్యాదులపై విచారణ అనంతరం వాస్తవాలు తేలాల్సి ఉంది&period; రైతులు మాత్రం రఫీని తక్కెళ్లపహాడ్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని అధికారులను కోరుతున్నారు&period; ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.