వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.

Advertisements

<p>వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది&period; ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆశ్రమంలో అక్రమంగా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు&period;యాలాల మండలం గోవిందరావుపేట గ్రామ శివారులో హైదరాబాద్ బోరబండకు చెందిన పప్పులాల్ పది ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు&period; అందులో 14 గుంటల స్థలంలో రాజస్థాన్‌కు చెందిన జైశ్రీరామ్ గిరి అనే స్వామీజీ&period;&period; మాతాజీతో కలిసి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు&period; ప్రతి అమావాస్య రోజున భక్తులు ఈ ఆశ్రమానికి వస్తుంటారని పోలీసులు తెలిపారు&period;అయితే ఆశ్రమం వద్ద గంజాయి సాగు జరుగుతోందన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు&comma; తాండూరు రూరల్ పోలీసులు&comma; యాలాల పోలీసులు&comma; ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు&period;ఈ తనిఖీల్లో ఆశ్రమం ముందు పెంచుతున్న సుమారు 36 గంజాయి మొక్కలతో పాటు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు&period; రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.