నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.

Advertisements

<p>నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది&period; నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ&comma; కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి&period; లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్‌ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టింది&period; అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌&period;రాంచందర్‌రావు గాంధీ భవన్‌ ముట్టడికి ప్రయత్నించగా అయన్ను పోలీసులు అరెస్ట్‌ చేశారు&period; దీంతో రెండు ప్రధాన పార్టీల కార్యాలయల ముట్టడికి ఇరు పార్టీల నాయకులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది&period; అదేవిధంగా రాజ్‌ భవన్‌ వద్ద కూడా పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు టీపీసీసీఅధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సహా మంత్రులను అరెస్ట్‌ చేశారు&period;<&sol;p>&NewLine;<p>కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రభుత్వ విప్‌ బల్మూరి వెంకట్‌ అధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు&period; ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు వారి వారి పార్టీ కార్యాలయాల వద్దకు భారీగా చేరుకున్నారు&period; ముందుగా బీజేపీ కార్యాలయం వద్దకు కాంగ్రెస్‌ నాయకులు చేరుకుని నిరసన ప్రదర్శన చేయడంతో పోలీసులు వారిని అడ్డకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు&period; ఆనంతరం గాంధీ భవన్‌ వద్దకు బీజేపీ శ్రేణులు చేరుకుని నిరసన ప్రదర్శన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది&period; ఒక్కసారిగా రెండు పార్టీల నాయకులు నాంపల్లి రోడ్ల పైకి రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా అయా పార్టీల వ్యతిరేక నినాదాలతో హొరెత్తాయి&period;<&sol;p>&NewLine;<p>బీజేపీ శ్రేణులు గాంధీభవన్‌ వైపు చొచ్చుకు వెళ్ళేందుకు ప్రయత్నించడంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు వారిని అడ్డకుకునేందుకు ప్రయత్నించారు&period; ఈ నేఫథ్యంలోనే ఇరు పార్టీల నాయకుల మద్య తీవ్ర స్థాయిలో తొప్పులాట జరగడంతో పాటు పరస్పర దాడులకు దిగ్గారు&period; ఇరు పార్టీల నాయకులు ఒక్కరి పై ఒక్కరు కర్రలు&comma; రాళ్ళతో దాడులు చేసుకున్నారు&period; ఈ దాడిలో పలువురు నాయకులు&comma; కార్యకర్తలకు గాయాలు కాగా జర్నలిస్టులు కూడా గాయపడ్డారు&period; ఈ దాడుల కారణంగా దీంతో నాంపల్లి ప్రధాన రహదారి పై మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకుంది&period; దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ విఫలం కావడంతో చివరకు లాఠీలకు పనిచెప్పారు&period;<&sol;p>&NewLine;<p>నీట్‌ పరీక్షల లీక్‌ తో పాటు రాహుల్‌ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఏఐసిసి పిలుపుమేరకు టీపీసీసీ అధ్వర్యంలో చలో లోక్ భవన్‌కు పిలుపునిచ్చారు&period; దీంతో లక్డీకాపూల్‌ నుండి లోక్‌ భవన్‌ వరకు టీపీసీసీ అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు&period; ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు&comma; ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి&comma; దామోదర్‌ రాజనర్సింహా&comma; ప్రభుత్వ విప్‌ బల్మూరి వెంకట్‌ లు పాల్గొన్నారు&period; ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తో పాటు మంత్రులు కూడా రాజ్‌ భవన్‌ ఎదుట బైటాయించి చేతులకు సంకెళ్ళు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు&period; రాజ్‌ భవన్‌ వద్దకు భారీగా చేరుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు ఒక్కసారిగా రాజ్‌ భవన్‌ వద్ద ఏర్పాటు చేసిన బారికెడ్లను తోసుకుని లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు&period; చివరకు పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.