నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం

Advertisements

<p>నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది&period; ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారిని కాపాడేందుకు వెళ్లిన తాత ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది&period; గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద ఆడుకుంటున్న బాలుడు అనుకోకుండా బోరు గుంతలో పడిపోవడంతో కుటుంబ సభ్యులు&comma; స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు&period; మనవడిని రక్షించాలనే ఆతృతతో వెంకన్న అనే వ్యక్తి వెంటనే బోరు గుంతలోకి దిగాడు&period; అయితే&comma; లోతైన గుంతలో ఇద్దరూ ఇరుక్కుపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది&period;<&sol;p>&NewLine;<p>స్థానికుల సమాచారంతో మిర్యాలగూడ రూరల్ పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు&period; గంటలపాటు శ్రమించి తాత&comma; మనవడిని బోరు గుంతలోంచి బయటకు తీశారు&period; అయితే అప్పటికే వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు&period; ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా&period;&period; మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు&period; చిన్నారిని మాత్రం సురక్షితంగా బయటకు తీయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు&period;మనవడిని కాపాడే ప్రయత్నంలో తాత ప్రాణాలు కోల్పోవడంతో ఊట్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..