పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత..

పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత..

Advertisements

<p>పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; ఓవర్‌లోడ్ మట్టి లారీల రవాణాతో విసిగిపోయిన స్థానిక గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి లారీలను అడ్డుకున్నారు&period; నిమ్మనపల్లి సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఏకమై మట్టి రవాణా వాహనాలను నిలిపివేసి భారీ ధర్నాకు దిగారు&period;<br &sol;>&NewLine;జిల్లాలోని కొదురుపాక చెరువు నుండి రాఘవపూర్ ఇటుక బట్టీలకు రాత్రింబవళ్లు వందలాది లారీల్లో మట్టిని తరలిస్తున్నారు&period; ఈ భారీ వాహనాల ఓవర్‌లోడ్ కారణంగా గ్రామంలోని అంతర్గత రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని స్థానికులు మండిపడుతున్నారు&period; లారీలు వెళ్లేటప్పుడు లేస్తున్న విపరీతమైన దుమ్ము వల్ల ఇండ్లల్లో ఉండలేకపోతున్నామని&comma; శ్వాసకోశ సమస్యలతో పిల్లలు&comma; వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<br &sol;>&NewLine;గత కొద్దిరోజులుగా ఈ అక్రమ&comma; ఓవర్‌లోడ్ రవాణాను నిలిపివేయాలని ఆందోళనలు చేస్తున్నప్పటికీ&period;&period; ఇరిగేషన్&comma; రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని సర్పంచ్ రమేష్ ఆరోపించారు&period; ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ మట్టి రవాణాను అరికట్టాలని&comma; ఓవర్‌లోడ్ వాహనాలకు భారీ జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నటి రమా నందన కుటుంబంపై ఇబ్రహీంపట్నంలో కేసు.

వికారాబాద్ జిల్లా, యాలాల్ మండలం, కోకట్ గ్రామ సమీపంలో విషాదం.

కామారెడ్డిలో రైల్వే ట్రాక్ పక్కన కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం.