నాంపల్లి బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

నాంపల్లి బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Advertisements

<p>తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు&period; నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ&period;&period; కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు&period; ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని&comma; పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని బండి సంజయ్ మండిపడ్డారు&period; &&num;8220&semi;గడిచిన పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను పూర్తిగా దోచుకుందని&comma; తెలంగాణ సిద్ధించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిపోయిందన్నారు&period; నాడు బీఆర్ఎస్ దోచుకుంటే&period;&period; నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే తీవ్ర అసహ్యం మొదలైందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు&period; తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లే 14 వందల మంది అమాయక యువకులు బలిదానం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు&period; ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదని&comma; రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలోనూ&comma; ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా సాగించడంలోనూ ప్రభుత్వానికి అస్సలు శ్రద్ధ లేదని విమర్శించారు&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్ర ప్రజలు ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలకు పాలించే అవకాశం ఇచ్చారని బండి సంజయ్ పేర్కొన్నారు&period; తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి&comma; నిజమైన ప్రజాస్వామ్య పాలను అందించే సత్తా కేవలం బీజేపీకే ఉందన్నారు&period; ఈసారి రాష్ట్రంలో మార్పు కోసం&comma; అవినీతి రహిత పాలన కోసం ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి అధికారంలోకి తీసుకురావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశవ్యాప్తంగా “పెద్ది” ఫీవర్..

ఉమ్మడి నిజామాబాదు జిల్లా, బిబిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం పాదయాత్ర.

నల్లగొండ జిల్లా, డిండి మండలం, ఎర్రగుంటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.