ఇవాళ పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి.

ఇవాళ పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి

Advertisements

<p>ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ&comma; రేపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు&period; రెండు రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో పలు ఎత్తిపోతల పథకాలు&comma; రిజర్వాయర్లు&comma; పంప్‌హౌస్‌లు&comma; ప్రతిపాదిత బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు&period; రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఇతర కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నారు&period; ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది&period; జడ్చర్లలోని కల్వకుర్తి ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్&comma; భద్రతా ఏర్పాట్లను పర్యాటక&comma; సాంస్కృతిక&comma; ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు&comma; ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి&comma; జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి పరిశీలించారు&period; సీఎం పర్యటన విజయవంతం అయ్యేలా అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.

విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!

భారత్‌కు చేరుకున్న ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్‌.