మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై దాడి.

మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై దాడి

Advertisements

<p>మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్‌ లో పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై కొందరు బ్లేడ్‌తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది&period; ఇందిరానగర్‌కు చెందిన మంద సాయి కుమార్ తన స్నేహితులతో కలిసి ఓ వైన్స్‌లో మద్యం సేవించి బయటకు వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది &period;ఆ సమయంలో చిలుకానగర్ వైపు నుంచి బైక్‌పై వచ్చిన జాన్&comma; పవన్‌ తో పాటు మరికొందరు సాయి కుమార్‌ను అడ్డగించి వాగ్వాదానికి దిగారు&period; మాటామాటా పెరగడంతో సాయి కుమార్ ఎదురుతిరగగా జాన్ తన వద్ద ఉన్న పదునైన బ్లేడ్‌ను తీసి సాయి కుమార్ మెడపై దాడి చేసినట్లు తెలుస్తుంది&period; దాడిలో సాయి కుమార్ మెడకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో అతడిని వెంటనే బోడుప్పల్‌ లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు&period;పాత కక్షలే దాడికి కారణమని తెలుస్తోంది &period;దాడికి పాల్పడిన పవన్&comma;&comma; బాధితుడు సాయి కుమార్ ఇద్దరు బోడుప్పల్ ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన వారే&period; ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.

విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!

భారత్‌కు చేరుకున్న ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్‌.