67
రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నేటితో నాలుగేళ్లు పూర్తి అయ్యాయి. 2019లో ఇదే రోజున సీఎం జగన్ మూడు రాజధానులపై ప్రకటన చేశారు. దానిని నిరసిస్తూ అమరావతి రైతులు, మహిళలు ఉద్యమ బాట పట్టారు. రాజధాని 29 గ్రామాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి నాలుగేళ్లుగా రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమం నేటితో 1,461వ రోజుకు చేరిన సందర్భంగా తుళ్లూరులో జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. రాజధాని రైతులు సర్వమత ప్రార్థనలు చేసి ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.