67
కారు బోల్తాపడిన ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి – దుత్తలూరు హైవేపై చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా పామూరు నుంచి కడపకు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. వారిని వెంటనే 108 వాహనంలో ఉధయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు బోల్తా పడటానికి అతి వేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.