చిలకలూరిపేట నియోజకవర్గం, బొప్పూడిలో నిర్వహించిన తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళానికి రాష్ట్రం నలుమూలల నుంచి అంచనాలకు మించి జన సంద్రోహం విచ్చేసారని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలిఫెంట్ లో ఏరియా సర్వేలో వస్తా జన సమీకరణాన్ని చూసి ఆశ్చర్య పోయారని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా అభినందించారని ప్రత్తిపాటి తెలియజేశారు. ఒక్క చిలకలూరిపేట నియోజకవర్గం నుంచే లక్ష మందికి పైగా జనాభా వచ్చారని అదేవిధంగా 20వేల బైకులు యువత ర్యాలీగా సభ ప్రాంగణానికి విచ్చేసారని తెలిపారు. 2014 సంవత్సరంలో నా అధ్యక్షతనే చిలకలూరిపేటలో తెలుగుదేశం, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో నేనే సభ శుభ నిర్వహించానని అదే సెంటిమెంటుతో నేడు బొప్పడిలో ప్రజాగళం సభ నిర్వహిస్తున్నామని మూడవసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోడీనే ఉండబోతున్నారన్నారు. ప్రధాని మోడీ ప్రసంగంలో మూడుసార్లు కరెంటు పోయినట్లు ఇది పోలీసుల వైఫల్యం వల్లనే జరిగిందని తెలియజేశారు. అంతేకాకుండా ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులకు, మీడియాకి, బస్సులు ఇచ్చిన కాలేజీ యజమాన్యాలకి, స్కూల్ యాజమాన్యాలకి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రత్తిపాటి తెలియజేశారు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
ఇదిచదవండి : ఎన్డీఏ ప్రజాగర్జన సభ ఘన విజయం…
CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి