శాంతిపురం మండలం సోగడబల్ల గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ మైనారిటీ నేత సర్దార్ భాష మృతి ఎంతగానో కలచివేసిందని ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం టిడిపి సీనియర్ మైనారిటీ నేత సర్దార్ భాష ఫించన్ తీసేసారని ఆవేదనతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సర్దార్ భాష కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సర్దార్ భాష మృతి తనను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ భాష మృతికి స్థానిక వైసిపి నాయకులే కారణమని ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సర్దార్ భాష ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు. చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గమ్మ ఇటీవల చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సర్దార్ భాష ఇంటికి వచ్చారన్నారు. సర్దార్ భాష కుటుంబీకులు ఎమ్మెల్సీ భరత్ సతీమణి ఇచ్చిన చీరను తిరస్కరించారని, సర్దార్ భాష ఫించన్ ఆపేయడం దారుణం అన్నారు. గ్రామంలో ఫించన్ అందరికీ అలాగే ఉంచి సర్దార్ భాష ఫించని వాలంటరీ గాయత్రి ఆపేసిందన్నారు. విషయం తెలుసుకుని సర్దార్ భాష సచివాలయం కు వెళ్ళి తన పెన్షన్ ఎందుకు ఆపేశారో చెప్పాలని కోరగా… సచివాలయ సిబ్బందికి సర్దార్ భాష మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆవేశంలో సర్దార్ భాష బీపీ పెరిగిపోవడంతో గుండె పోటుతో అక్కడే మృతి చెందినట్లు తనకు బాధిత కుటుంబీకులు తెలిపినట్లు చెప్పారు. గుండెపోటుతో మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి సచివాలయ సిబ్బంది తరలించడం సరికాదన్నారు. మృతి చెందిన సర్దార్ భాష వేలిముద్రలు తీసుకొని ఫించని ఇచ్చామంటూ చెప్పడం బాధాకరంగా ఉందన్నారు. వైసిపి నేతలు, సచివాలయ సిబ్బంది కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సర్దార్ భాష సచివాలయనికి వెళ్లి ప్రశ్నించినప్పుడు ప్రశాంతంగా మాట్లాడి తనకు రావలసిన ఫించని ఇచ్చి ఉంటే నిండు ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాదన్నారు. ఆయనను రెచ్చగొట్టి… ఎమ్మెల్సీ సతీమణి ఇచ్చిన చీర తీసుకోలేదు అని చెప్పి పింఛన్ ఆపి సర్దార్ భాష మృతి చెందడానికి కారకులైన వైసీపీ నేతలు, సచివాలయ సిబ్బంది, పింఛన్ ఆపిన వాలంటరీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకోకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. సర్దార్ భాష కుటుంబ సభ్యులకు న్యాయం చేసేంతవరకు టిడిపి అండగా ఉంటుందని ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
పింఛను ఆపేశారన్న ఆవేదనతో ఆగిన గుండె…
69
previous post