తీవ్రంగా మారనున్న మిచాంగ్ తుఫాన్ ప్రభావం…

chandrababu

Advertisements

&NewLine;<p>రాష్ట్రంపై &&num;8216&semi;మిచాంగ్&&num;8217&semi; తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు&period; ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు&period; తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని… ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు&period; గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా… ప్రభుత్వం తగు రీతిలో స్పందించలేదని అన్నారు&period; ధాన్యం కొనుగోలులో రకరకాల ఆంక్షలతో ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారని… సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు&period; పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని… ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలని అన్నారు&period; తుఫాన్ బాధిత ప్రజల కోసం షెల్టర్లు&comma; అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు&period; మరో వైపు మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో చంద్రబాబు శ్రీశైలం పర్యటనను వాయిదా వేసుకున్నారు&period; షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆయన శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాల్సి ఉంది&period; ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి&period; అయితే తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత దర్శించుకోవాలని అధినేత నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి&period; ఇదిలా వుంచితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ లభించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలోని దేవాలయాలను సందర్శిస్తున్నారు&period; ఈ మధ్యే తిరుమలలో శ్రీవారిని&comma; విజయవాడలో కనకదుర్గమ్మ&comma; సింహాచలంలో అప్పన్నను దర్శించుకున్నారు&period; త్వరలోనే శ్రీశైలం మల్లన్నతోపాటు కడప దర్గా&comma; మేరీమాత చర్చిలను ఆయన సందర్శించనున్నారు&period; కాగా ఆలయాల సందర్శనకు వెళ్తున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతాలు పలుకుతున్నాయి&period; భారీ ర్యాలీలతో అధినేతకు మద్దతుగా నిలుస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..

బంగారంపై మోదీ మాస్టర్ ప్లాన్..?

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..